25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ద్విచక్ర వాహనం దొంగ అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు పట్టణంలో ఈనెల 4న  రాత్రి సమయంలో నాగన్నగారి భూమయ్య ఇంట్లో పార్క్ చేసిన టీవీఎస్ ఎక్సెల్ ని  దొంగలించిన జంగంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు మహేష్ అనే వ్యక్తిని సోమవారం అరెస్టు చేసే రిమాండ్ కు తరలించడం జరిగిందని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ భిక్కనూరు టోల్గేట్ వద్ద భిక్కనూరు పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అతడిని పట్టుకొని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కొరకు జైలు  పంపడం జరిగిందని, అతని వద్దనుండి దొంగతనానికి ఉపయోగించిన కటింగ్ ప్లేయర్లు స్క్రూ డ్రైవర్లు దొంగలించిన టీవీఎస్  ఎక్సెల్ స్వాధీనపరుచుకోవడం జరిగిందన్నారు.

More articles

Latest article