27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రాంభూపాల్ కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం అఖిల భారత కాంగ్రెస్ ప్రకటించిన రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జాబితాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రాంభూపాల్ కు చోటు కల్పించడం పట్ల మాజీ కౌన్సిలర్, కుర్రో రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయికుమార్, స్వామి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ కి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు. రాంభూపాల్ తో జిల్లాలో పార్టీ బలోపేతానికి పనిచేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయి దృష్టిలో ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరుగుతుందని, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

More articles

Latest article