29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

లింబాద్రిగుట్ట జాతర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

Must read

📰 Generate e-Paper Clip

భీంగల్, బతుకమ్మ : భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహా స్వామి జాతర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు భీంగల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. జాతరకు వచ్చే వాహనాలు భీంగల్ నుంచి పురానీపేట్ మీదుగా లింబాద్రి గుట్టకు చేరుకోవాలని తెలిపారు. జాతర నుంచి బయటకు వచ్చే వాహనాలు లింబాద్రి గుట్ట నుంచి బయలుదేరి పల్లికొండ, లింగాపూర్, సిద్ధపల్లి మీదుగా భీంగల్ చేరుకోవాలని సూచించారు. హెవీ వెహికల్స్ పల్లికొండ, పిప్రి, ముచ్కూర్, బెజ్జోరా మీదుగా భీంగల్ చేసుకోవాలని తెలిపారు.

More articles

Latest article