29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గణేష్ శోభాయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ:  నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ లలోని  గణేష్ నిమజ్జనోత్సం శోభాయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు.  నిమజ్జనోత్సవ శోభాయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అన్ని డివిజన్ పరిధిలలో ప్రధాన నిమజ్జన మార్గాల్లో దాదాపు 1300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని, సీసీ కెమెరాల ద్వారా నిఘా డ్రోన్ కెమెరాలలతో పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు, పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ శాఖ, ఫారెస్టు శాఖ, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ మొదలగు వారితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.   నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని, అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని  కోరారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ నియమాలు అందరూ పాటించాలని తెలిపారు. ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలని,డి.జేలు పూర్తిగా నిషేదం, ఎటువంటి ” రూమర్స్ ” ( పుకార్ల) ను నమ్మరాదు అన్నారు. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించారు.  అత్యవసర సమయంలో 100 డయల్ లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126-59700 కు సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించగలరని కోరారు.ప్రజలందరూ ఈ గణేష్ శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సీపీ పి.సాయి చైతన్య తెలియజేశారు.

Tight security arrangements for Ganesh Shobha Yatra

More articles

Latest article