27.3 C
Hyderabad
Friday, July 31, 2026

భాగస్వాముల కలయికే న్యాయసేవ సంస్థకు బలం

Must read

📰 Generate e-Paper Clip

  • కక్షిదారులకు కాలమే విలువైనది
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విషాదాన్ని దిగమింగుకుని జాతిహితం కోసం జాతీయ లోక్ అదాలత్ కు తరలివచ్చిన జన ఆదరణ మరువలేమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి ఎన్ భారత లక్ష్మీ అన్నారు. న్యాయవాద వృత్తిలో భవిష్యత్ ఉన్న న్యాయవాది కిరణ్ కుమార్ గౌడ్ అకాల మృతి పరిస్థితులలో లోక్ అదాలత్ నిర్వహించుకోవడం భాధగానే ఉన్నదని ఆమె విన్నవించారు. జాతీయ లోక్ అదాలత్  ను జిల్లాకోర్టు ఆవరణలోని న్యాయసేవ సదన్ లో జ్యోతి వెలిగించి ప్రారంభించిన అనంతరం ఆమె న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కాక్షిదారుల నూద్దేశించి మాట్లాడారు.జాతీయ లోక్ అదాలత్ అంటేనే జాతిహితం ముడిపడి ఉన్నందున నిర్వహించుకోవడం శుభకరమేనని తెలిపారు. న్యాయస్తానాలలో న్యాయం ఎవరికో ఒకరికి అనుకూలంగా రావచ్చని కాని లోక్ అదాలత్ లో ఇరుపక్షాలు రాజీ పద్ధతిన పరిష్కరించుకోవడం ఇరుపక్షాల విజయం దాగి ఉన్నదని ఆమె తెలిపారు. దీని వలన అత్యంత విలువైన సమయం కక్షిదారులకు లభించి మరొక కార్యక్రమానికి కేటాయించుకునే అవకాశం లభిస్తుందని ఆమె విశ్లేషంచారు. దీర్ఘాకాలిక తొవ్వ న్యాయాన్ని దీర్ఘకాలంలో అందిస్తుందని కాని మధ్యస్తపు తొవ్వ మధ్యలోనే న్యాయాన్ని సత్వరం అందిస్తుందని అవి ప్రజా న్యాయ పీఠాలని ఆమె తెలిపారు.బార్ అసోసియేషన్ అనే బలమే న్యాయసేవ సంస్థకు కలిమిగా ఉండి నడిపిస్తున్నదని వివరించారు.మోటారు రోడ్డు ప్రమాద బాధితులకు భీమా డబ్బులు త్వరితిగతిన అందిచడంలో లోక్ అదాలత్ క్రీయాశీలక పాత్రేనని పేర్కొన్నారు. బాధితులకు ఆర్థిక స్వాంతన అందిచడంతో వారి కుటుంబాలలో వెలుగులకు కారణభూతులు కావడం న్యాయసేవ సంస్థకు గర్వకారణమని అన్నారు. ఉచిత న్యాయసేవలతో ఆర్థికంగా చితికిన కుటుంబాలకు అండగా ఉండగలుగుతున్నామని జిల్లాజడ్జి భారత లక్ష్మీ తెలిపారు. పోలీసు శాఖ సహకారం మరోమెట్టుగా లోక్ అదాలత్ విజయంలో నిలిచిందని ఆమె కితాబునిచ్చారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి మాట్లాడుతూ న్యాయసేవ సంస్థ కార్యాకమాలలో చేదోడువాదోడుగా నిలుస్తామని అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి ప్రసంగిస్తూ న్యాయవ్యవస్థకు బలమైన వారధిగా న్యాయసేవ సంస్థ నిలుస్తోందని తెలిపారు. లోక్ అదాలత్ విజయానికి విసృత ప్రచారం కల్పించి భాగస్వామూలం కావడం జరిగిందని నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకట రెడ్డి తెలిపారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాల సమహారాన్ని విషదీకరించారు. కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జి హరీష, సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్భు ఉపాధ్యాయ్, గోపికృష్ణ, హరి కుమార్, శ్రీనివాస్ రావు, కీర్తిరాజ్, బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు తదితరులు పాల్గొన్నారు.

  • రూ.9 కోట్ల 26 లక్షలకుగాను అవార్డులు జారీ..

నిజామాబాద్ జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయస్తానాలతో పాటు ఆర్మూర్, బోధన్ కోర్టులలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ మొత్తం 26 వేలకు పైగా కేసులను రాజీపద్ధతిన పరిష్కరించి అవార్డులు జారీ చేసినట్లు న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తెలిపారు. మోటారు రోడ్డు ప్రమాద నష్ట పరిహార కేసులు, బ్యాంక్ రుణ కేసులలో 9 కోట్ల 26 లక్షలకు గాను అవార్డులు అందజేసినట్లు ఆయన తెలిపారు.

The strength of a legal service firm lies in the combination of partners

More articles

Latest article