26.3 C
Hyderabad
Monday, August 3, 2026

పేదవాడి స్ఫూర్తి,పౌరుషాల కీర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

  •  టిడిపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్

 

 రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్బంగా సిరిసిల్ల పట్టణంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్.ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ  తెలంగాణ తొలిరాజు,బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, దొరల అరాచకాలను,మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీ,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు & టీడీపీ వేములవాడ నియోజకవర్గ అడహాక్ కమిటీ సభ్యులు మోతె రాజిరెడ్డి,సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్ ఆరె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article