27.3 C
Hyderabad
Friday, July 31, 2026

మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

 

జుక్కల్, బతుకమ్మ :

 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం జుక్కల్, పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ల్యాబ్, మెడికల్ హెల్త్ కోసం అవసరమైన మందులు, నర్సింగ్ స్టాఫ్ కొరత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు పొందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ భాస్కర్, ఆసుపత్రి వైద్యులు, హెచ్డిఎస్ కమిటీ సభ్యులు, సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

The government's goal is to provide better medical services.

More articles

Latest article