మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

  . . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు   జుక్కల్, బతుకమ్మ :   ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం జుక్కల్, పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు....