హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామా లేఖను బుధవారం తెలంగాణ శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓఎస్డీకి తెలంగాణ జాగృతి నాయకులు అందజేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడి తన రాజీనామాను ఆమోదించాలని కల్వకుంట్ల కవిత కోరారు. తాను అందుబాటులో లేని అని గురువారం మరోసారి ఫోన్ లో మాట్లాడి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ గుత్తా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామా లేఖను తెలంగాణ భవన్ లో పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డికి తెలంగాణ జాగృతి నాయకులు అందజేశారు. లేఖను తీసుకొని రిసీవ్డ్ కాపీ భవన్ సెక్రటరీ అందజేశారు.

