కవిత రాజీనామా లేఖను మండలి చైర్మన్ ఓఎస్డీకి అందజేసిన తెలంగాణ జాగృతి నాయకులు
హైదరాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామా లేఖను బుధవారం తెలంగాణ శాసన మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓఎస్డీకి తెలంగాణ జాగృతి నాయకులు అందజేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడి తన రాజీనామాను ఆమోదించాలని కల్వకుంట్ల కవిత కోరారు. తాను అందుబాటులో లేని అని గురువారం మరోసారి ఫోన్ లో మాట్లాడి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ గుత్తా చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక...