24.1 C
Hyderabad
Monday, August 3, 2026

హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యదర్శిగా తలారి సాయన్న

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హ్యూమన్ రైట్స్ జిల్లా కార్యదర్శిగా తలారి సాయన్నను నియమిస్తు జిల్లా అధ్యక్షురాలు తేలు సరిత, స్టేట్ వైస్ చైర్మన్ పట్టేపురం వీనా రాణి, స్టేట్ జనరల్ సెక్రటరీ బన్సోడె మధు ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు. సమాజంలో హ్యూమన్ రైట్స్ గురించి ప్రజలందరికీ తెలిసేలా ఎవరైనా భారత రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను ఉల్లంఘించినట్లయితే బాధితులకు హ్యూమన్ రైట్స్ తరఫున సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. మానవ హక్కుల గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. తనకు హ్యూమన్ రైట్స్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ పదవిని ఇచ్చినందుకుగాను రాష్ట్ర అధ్యక్షులు సర్వేందర్ కు, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర, జిల్లా హ్యూమన్ రైట్స్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article