23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పిడిఎస్యు రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.హెచ్ రాందాస్

 

మద్నూర్, బతుకమ్మ: విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని పిడిఎస్యు రాష్ట్ర కమిటీ సభ్యుడు సి.హెచ్ రాందాస్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత సంఘం ఆధ్వర్యంలో ఈనెల ఫిబ్రవరి 4, 5 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ కేంద్రంలో పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిర్వహించారు. ఈ జనరల్ కౌన్సిల్లో కామారెడ్డి జిల్లా నుండి సి. హెచ్. రాందాస్ ని  రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అసమాన త్యాగాల మీద ఏర్పడిన విద్యార్థి సంఘం తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను ఇచ్చినందుకు విద్యారంగ సమస్యలపై ప్రజాల సమస్యలపై కార్మిక సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై రాజీలేని సమరశీల  పోరాటాలు నిర్వహిస్తానని సి.హెచ్.రాందాస్ పేర్కొన్నారు. అంతేకాకుండా మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు విద్యార్థుల ఫీజు బకాయలు త్వరితగతిన ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతి గృహాలలో మెనూ ప్రకారం విద్యార్థులను పౌష్టికాహారం అందించడం లేదని ఇది సరికాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ విధానం మార్చుకోకపోతే విద్యార్థులను చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

More articles

Latest article