27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలీస్ సబ్ కంట్రోల్ పునరుద్దరణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  పోలీస్ సబ్ కంట్రోల్ లు పునరుద్దరణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని  పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. ప్రధాన జంక్షన్ లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) టెక్నాలజీతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రధాన జంక్షన్లు ” పోలీస్ సబ్ కంట్రోల్స్ ” అభివృద్ధి కోసం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సబ్ కంట్రోల్స్ ఆర్టీసీ బస్టాండ్ , బోధన్ బస్టాండ్, అర్సపల్లి చౌరస్తా,  చార్ బై పెట్రోల్ బంక్ ,  వీక్లీ మార్కెట్ , కంటేశ్వర్ చౌరస్తా టీ జంక్షన్ మొదలగు వాటిని పునరుద్ధరణ చేసి వాటిని త్వరితగతిన వాడకములోనికి తీసుకురావడానికి తీసుకోవలసినటువంటి ప్రత్యేకమైన చర్యల గురించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ జంక్షన్ లలో అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) టెక్నాలజీలతో గల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ట్రాఫిక్ వాయులేషన్ పై తగు చర్యల గురించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అవసరమైనటువంటి ప్రధానమైన జంక్షన్ లలో కొత్త ట్రాఫిక్ సిగ్నల్ లను జీబ్రా లైన్లను స్టాఫ్ లైన్స్ ను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ హనుమాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. వివిధ జంక్షన్ లలో అవసరమైన చోట వెంటనే ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు కోసం ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి సయ్యద్ మస్తాన్ అలీ , ట్రాఫిక్ సీఐ పి. ప్రసాద్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్ ( వెల్ఫేర్ ) తిరుపతి అధికారులు పాల్గొన్నారు.

Strong steps must be taken to restore police sub-control

More articles

Latest article