27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పది ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని ఎస్ఆర్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటారని ఎస్ఆర్ జోనల్ ఇంచార్జీ ప్రణీత్ తెలిపారు. ఎస్ ఆర్ పాఠశాల విద్యార్థులందరూ 100శాతం ఉత్తీరణ సాధించారని తెలిపారు. 600 మార్కులకు గాను 580కి పైగా 5గురు విద్యార్థులు, 570కి పైగా  16మంది విద్యార్థులు,  560కి పైగా 58మంది విద్యార్థులు, 500కి పైగా 192మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఇంతటి ఘన విజయం అందించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ ఇషాక్, మేరీ, సరళ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article