27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 79వ పుట్టినరోజును  జిల్లాకేంద్రంలోని  కాంగ్రెస్ భవన్ లో నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ  చొరవతోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని, వారికి  ప్రజలు రుణపడి ఉంటారన్నారు. నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ  ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆమె మన్మోహన్ సింగ్ ను ఎన్నుకున్నారని,  ప్రజా సేవ కోసం జీవితం అంకితం చేశారని పేర్కొన్నారు.  ఈసందర్బంగా వారు సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతూ,   ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని  ఆకాంక్షించారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్,  నుడా చైర్మన్ కేశ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, ఏఎంసీ  చైర్మన్ ముప్ప గంగారెడ్డి ,భక్తవత్సలం,జావీద్ అక్రమ్,రత్నాకర్,రామర్తి గోపి,విపుల్ గౌడ్,వేణు రాజ్,రాజా నరేందర్ గౌడ్ ,సేవాదళ్ సంతోష్,యాదగిరి,ఈసా,మఠం రేవతి,అబ్దుల్ ఎజాజ్ ,పోల ఉష,చంద్రకళ,లవంగ ప్రమోద్,సకినాల శివ కుమార్,అంతరెడ్డి విజయ్,పాల్ రెడ్డి,విజయ లక్ష్మీ ,సుజాత,ఆశబి,మాలిక బేగం,రాజేంద్ర ప్రసాద్ ,నరేందర్ గౌడ్ ,విజయ రాణి,స్వప్న,మీనా,షకీల్,ముస్తఫా,ఆదే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Sonia Gandhi's birthday celebrated in grand style

 

More articles

Latest article