ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుక
నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ 79వ పుట్టినరోజును జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్ లో నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ చొరవతోనే ప్రత్యేక...