24 C
Hyderabad
Sunday, August 2, 2026

మానవత్వం చాటుకున్న కుడుముల

Must read

📰 Generate e-Paper Clip

– అగ్ని ప్రమాదబాధిత కుటుంబానికి నిత్యావసరాలు, దుస్తులు అందజేత
ఎల్లారెడ్డి, బతుకమ్మ: మండలంలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన కుమ్మరి పెద్ద నాగయ్యకు చెందిన నివాసపు గుడిసె ఈనెల 13వ తేదీన గ్యాస్ సిలిండర్ పేలి దగ్ధమైంది. బాధిత కుటుంబాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ గురువారం పరామర్శించారు.

నెలకు సరిపడా నిత్యావసరాలతోపాటు దుస్తులు, దుప్పట్లు అందజేశారు. వేసవికాలం కావడంతో వాకిట్లో పడుకున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించిందని, ఒక వేళ గుడిసెలో పడుకుని ఉంటే కుటుంబ సభ్యులమందరం సజీవ దహనమయ్యే వారిమని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. బాధితులకు సత్యనారాయణ మనోధైర్యం కల్పించారు.

More articles

Latest article