27.5 C
Hyderabad
Friday, July 31, 2026

భీంగల్, నందిపేట్ బాల్కొండ మండలాల్లో తపాలా కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

 మంజూరు చేసిన కేంద్ర మంత్రి సింధియా కి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అర్వింద్

నిజామాబాద్, బతుకమ్మ :  భీంగల్,నందిపేట, బాల్కొండ మండల కేంద్రాల్లో పోస్ట్ ఆఫీస్ భవనాల మంజూరు కొరకు ఇటీవల ఆయా మండలాల ప్రజలు ఎంపీ అర్వింద్ ని కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. వీరి విజ్ఞప్తుల పట్ల వెంటనే స్పందించిన ఎంపీ అర్వింద్ నూతన భవనాల మంజూరుకు సంబంధిత మంత్రి జ్యోతిరాధిత్య సింధియా కి లేఖ రాసి సత్వరమే భవనాలు మంజూరు చేయాలని కోరారు. అంతేగాకుండా తపాలా శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని, సంబంధిత పత్రాలు త్వరగా పంపేలా చొరవ తీసుకున్నారు.    ఎంపీ అర్వింద్ విజ్ఞప్తులను పరిశీలించిన మంత్రి జ్యోతిరాధిత్య సింధియా నందిపేట, బాల్కొండ, భీంగల్ మండల కేంద్రాల్లో నూతన తపాలా కార్యాలయాల భవనాల నిర్మాణాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు ఎంపీ అర్వింద్ కి లేఖ ద్వారా తెలియజేశారు. తన విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించి, తక్షణమే భవనాలు మంజూరు చేసిన మంత్రి సింధియా కి పార్లమెంట్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.

More articles

Latest article