27.3 C
Hyderabad
Friday, July 31, 2026

రేవంత్, బండి సంజయ్ ల ఫెవికల్ బంధం భగిరథ్ ను కాపాడుతుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పరారీలో ఉన్నారని సిట్ విచారణ పేరుతో నిందితుణ్ణి తప్పించే ప్రయత్నం

. . . మైనర్ పై అఘాయిత్యం జరిగితే మూడునెలలైన ఫిర్యాదు తీసుకోలె

. . .  మైనర్ బాధితురాలిపై కేసు పెట్టడం అత్యంత దుర్మార్గం

. . . రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, బతుకమ్మ :

పొక్సో (పీఓసీఎస్ఓ) కేసు నిందితుడు అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మెల్యే తన స్వగృహం వేల్పూర్ మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ… కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉన్నారని చెబుతూ, సిట్ విచారణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిందితుణ్ణి తప్పించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఒక మైనర్ బాలికపై డ్రగ్స్, మద్యం ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్న, పోలీసులు మూడు నెలల పాటు ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందని ఆయన ఆరోపించారు. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత గత్యంతరం లేక పోలీసులు కేసు నమోదు చేశారని మండిపడ్డారు. పోక్సో చట్టం ప్రకారం మైనర్ బాలిక చెప్పింది వేదం అని, అటువంటి కేసులో బాధితురాలికి రక్షణ కల్పించాల్సింది పోయి.. నిందితుడు ఆమెపైనే తిరిగి  ‘ హనీ ట్రాప్ ’ పేరుతో కేసు పెట్టడం దారుణమని అన్నారు. మైనర్ బాలిక హనీ ట్రాప్ చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. బాధితురాలిపై రివర్స్ కేసులు పెట్టడం చూస్తుంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకటేనని అర్థమవుతోందని, వాళ్ల ఇద్దరిదీ ఫెవికాల్ బంధం” అని ఆయన ఎద్దేవా చేశారు. వీరిద్దరూ కలిసి వ్యాపారాలు చేస్తున్నారు, కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అందుకే ఒక కేంద్ర మంత్రి కొడుకుపై ఇంత పెద్ద నేరం మోపబడిన రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండి పోయింది, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా దీనిపై స్పందించకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటి ఆయన ప్రశ్నించారు. పొద్దున లేస్తే కేసీఆర్ కుటుంబం మీద, కేటిఆర్ మీద, హరీష్ రావు మీద విషం చిమ్మే బండి సంజయ్, తన కొడుకు చేసిన నేరంపై ఏం సమాధానం చెబుతారన్నారు . ఇతరుల వ్యక్తిగత విషయాలను రాజకీయం చేసే సంజయ్, ఇప్పుడు తన కొడుకు పై వచ్చిన ఈ పోక్సో కేసుపై నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ కేసులో రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపింఛలాన్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర పోలీసులు ఇప్పటికైనా ఒత్తిళ్లకు లొంగకుండా చట్టాన్ని గౌరవించాలని, బాధిత మైనర్ బాలిక కు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

More articles

Latest article