27.3 C
Hyderabad
Friday, July 31, 2026

జీపీఎఫ్ వర్తింపచేయాలని ఎమ్మెల్యేకు వినతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జెంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ నుండి జిపిఎఫ్ 1999 నుండి 2004 వరకు నియమాకమైన ఉద్యోగస్తులకు జిపిఎఫ్ వర్తింపచేయాలని కాంగ్రెస్ శాసనసభ్యులకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి నిజాంబాద్ జిల్లా పవర్ ఎంప్లాయిస్ సంయుక్త కార్యచరణ సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.  వినతిపత్రం పై స్పందిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ సంస్థలు, స్టాప్ ఉద్యోగులు, ఇంజనీర్లు బాగా పనిచేసి గత సంవత్సరం పంటలు పండడానికి మీరే కారణమని బాగా పనిచేస్తున్నారని విద్యుత్ ఉద్యోగులను అభినందించారు. ఇచ్చిన వినతిపత్రం రాష్ట్ర ఉపముఖ్యమంత్రికి పంపిస్తానని.. ప్రభుత్వంలో ఉద్యోగులకు 2004 వరకు జిపిఎఫ్ వర్కింగ్ చేస్తున్నారో మరి విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా 2004 వరకు జిపిఎఫ్ వర్తింప చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవిస్తానని తెలిపారు. దీనికి నిజామాబాద్ జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. యాక్షన్ కమిటీ చైర్మన్ రఘునందన్ మాట్లాడుతూ ఈపీఎఫ్ టు జిపిఎఫ్ కూడా రాష్ట్రంలో ఉన్న 5000 మందికి ఉద్యోగస్తులకు వర్తించేటట్టు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవర్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ రఘునందన్, కన్వీనర్ బాలేష్ కుమార్, కో కన్వీనర్ తోట రాజశేఖర్, ఈపీఎఫ్ టు జిపిఎఫ్ నాయకులు శ్రీనివాస్, శ్రీరామ్, మూర్తి, జేఏసీ నాయకులు మల్లేష్, భాషెట్టి సురేష్ కుమార్, గంగారాం నాయక్, రాజేందర్, చంద్రశేఖర్, శంకర్ నాయక్, సతీష్, హరికృష్ణ, బి.శ్రీనివాసు, రాంగోపాల్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Request to MLA to implement GPF

More articles

Latest article