29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ బహుకరించిన పూర్వ విద్యార్ధులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్:

మోర్తాడ్ మండలం సుంకేట్  జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో విద్యను అభ్యసించిన 2000-2001 పదవ తరగతి బ్యాచ్ కు సంబంధించిన పూర్వ విద్యార్థులు తమ పాఠశాలకు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ బహుకరించారు. విద్యార్థులకు తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని సుమారు రూ. 65 వేల విలువగల ప్యూరిపైడ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పీ. సంతోష్ కుమార్ మాట్లాడుతూ చదువు నేర్చుకున్న పాఠశాలలో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చినందుకు బ్యాచ్ విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Purified drinking water system gifted by alumni

More articles

Latest article