27.5 C
Hyderabad
Friday, July 31, 2026

నిజాంసాగర్ డ్యాం వద్ద ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : నిజాంసాగర్ డ్యాం వద్ద ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం నిజాంసాగర్ మండలం నిజాంసాగర్ డ్యామ్ వద్ద ఎకో టూరిజం పనులకు సంబంధించిన వాటిపై టూరిజం అసిస్టెంట్ మేనేజర్ రాజు, కన్సల్టెంట్ హరి లతో కలెక్టర్ మాట్లాడారు. ప్రతిపాదించిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అన్నారు. భూమికి సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని తహసీల్దార్ భిక్షపతి ని ఆదేశించారు.

More articles

Latest article