27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అనుమతి ఒకవైపు.. తరలింపు మరోవైపు…

Must read

📰 Generate e-Paper Clip

  • ఆగని ఇసుక అక్రమ రవాణా
  • అధికారుల చర్యలు శూన్యం
  • వ్యక్తమవుతున్న అనుమానాలు

 

నిజామాబాద్, బతుకమ్మ :

అభివృద్ధి పనుల పేరిట ఇసుక రవణాకు అనుమతి ఒకవైపు తరలించడం మరోవైపు.. అన్న చందంగా  ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా జోరుగా కొనసాగుతోంది. అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్న కూడా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. పోతంగల్ మండలంలోని మందిర పరివాహక ప్రాంతాల్లో  నుండి ఇసుక రవాణాకు అనుమతి తీసుకొని ఇసుక రవాణా మరోవైపు కొనసాగిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవణ కొనసాగిస్తున్నప్పటికీ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పోతంగల్ మంజీరా శివారు నుండి సోమేశ్వర్ ఎన్ హెచ్ 765 డి కి అనుమతి తీసుకొని వెళ్లవలసిన ఇసుక లోడ్ మహారాష్ట్ర వైపు తరలిస్తున్న సమాచారం మేరకు వాహనాన్ని స్థానికులు అడ్డుకొని రెవెన్యూ అధికారులకు బుధవారం అప్పచెప్పారు. ఇసుక రవాణాకు  వే బిల్లులు  కొంతమేరకు తీసుకొని అనేక ట్రిప్పులు ఇసుక రవాణా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని సందర్భాలలో  ప్రభుత్వ పనులకు అనుమతి తీసుకుని మంజీరా నది నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఒక ప్రాంతంలో డంపు చేసి అక్కడి నుంచి రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణా పై  చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి  పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుని ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

Permission on one side.. relocation on the other...

More articles

Latest article