29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

గుంతకల్ ప్యాసింజర్ రైలులో ఉరి వేసుకుని వ్యక్తి అత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

 

 బోదన్, బతుకమ్మ:

బోధన్ రైల్వే స్టేషన్ లో అగిఉన్న గుంతకల్ ప్యాసింజర్ రైలులో ఉరి వేసుకుని వ్యక్తి అత్మహత్య కు పాల్పడ్డారు. ఈ సంఘటన బుదవారం ఉదయం వెలుగు చూసింది. సుమారు 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి బోదన్ రైల్వే స్టేషన్ లో నిలిచి ఉంచిన ప్యాసింజర్ రైలులో మంగళవారం రాత్రి ఉరివేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ నవిన్ కుమార్ రైల్వే పోలిస్ లకు సమాచారం అందించారు. నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి అధ్వర్యంలో ఘటన స్థలాన్ని పరిశీలించి అత్మహత్యకు పాల్పడ్డ వ్యకి అచూకి కోసం ప్రయత్నించారు. వివరాలు ఎవి దోరక్కపోవడంతో డేడ్ బాడిని నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అత్మహత్యకు పాల్పడిన వ్యక్తి వివరాలు తెలిస్తే రైల్వే పోలిస్ లను లేదా నిజామాబాద్ జిజి హెచ్ లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.

More articles

Latest article