29 C
Hyderabad
Monday, August 3, 2026

ఎస్సీ బాలికల గురుకుల హాస్టల్  వార్డెన్ మమత సస్పెండ్

Must read

📰 Generate e-Paper Clip

 బాన్సువాడ, బతుకమ్మ:

 బాన్సువాడ ఎస్సీ బాలికల గురుకుల హాస్టల్  వార్డెన్ మమత సస్పెండ్ చేస్తు ఆర్డిఓ రవిందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.  ఈనెల 8న ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న అమృత అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. విద్యార్థిని హాస్టల్ లో ఉండి బలవన్మరణానికి పాల్పడిన రోజు వార్డెన్ లేదని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణకు జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్  ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ కు అప్పగించారు. ఆయన ఇచ్చిన విచారణ నివేదికను కలెక్టర్ కు అందజేయగా వార్డెన్ మమత నిర్లక్ష్య విధులపై వేటు వేస్తూ  ఆదేశాలు వెలువడ్డాయి.

More articles

Latest article