24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నిజాంసాగర్ ప్రాజెక్టు 13 గేట్ల ఎత్తివేత

Must read

📰 Generate e-Paper Clip

నిజాం సాగర్, బతుకమ్మ:  నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటేత్తడంతో ప్రాజెక్టు అధికారులు వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అదివారం రాత్రి 7 గేట్లను ఎత్తి 53,500 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదిలిన అధికారులు సోమవారం ఉదయం  13 గేట్లను ఎత్తి   85,000    క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15. 667 టీఎంసీల నీరు నిల్వఉంది. 85,000 క్యూసెక్కుల వరద వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంజీరా నదికి వరదలు రావడం, సింగూర్ డ్యాం నుంచి 43,634 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుండటంతో నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి విడుదలను పెంచినట్లు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ధ నీటి విడుదలను జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రాజెక్ట్ అధికారులు పర్యవేక్షించారు.

More articles

Latest article