నిజాంసాగర్ ప్రాజెక్టు 13 గేట్ల ఎత్తివేత

నిజాం సాగర్, బతుకమ్మ:  నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటేత్తడంతో ప్రాజెక్టు అధికారులు వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అదివారం రాత్రి 7 గేట్లను ఎత్తి 53,500 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదిలిన అధికారులు సోమవారం ఉదయం  13 గేట్లను ఎత్తి   85,000    క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15. 667 టీఎంసీల నీరు నిల్వఉంది. 85,000 క్యూసెక్కుల వరద వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు...