25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

లొంగిపోయిన మావోయిస్టు కీలకనేత

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  మావోయిస్టు పార్టీకి మరో ఎదరుదెబ్బ తగిలింది. శుక్రవారం మావోయిస్టు ముఖ్య నేత బర్సే దేవా.. డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. దేవా మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. మావో అధినేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలను బర్సే దేవా చూస్తున్నారు. హిడ్మా, బర్సే దేవా ఒకే గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరాలో దేవా అత్యంత కీలక పాత్ర పోషించారు. దేవాతో పాటు మిల్ట్రీ ఆపరేషన్ సభ్యులు కూడా లొంగిపోయారు. బర్సే దేవాపై రూ. 50లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం.  దేవా లొంగిపోవడం, తదితర వివరాలను శనివారం డీజీపీ మీడియా సమావేశంలో చెప్పనున్నట్లు తెలుస్తోంది.

More articles

Latest article