24.1 C
Hyderabad
Monday, August 3, 2026

జిల్లాలో 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ అమలు

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను ద్రుష్టిలో ఉంచుకుని నెల రోజుల పా టు జులై 1నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ప్రజా ధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్ట వద్దని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More articles

Latest article