27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ హోంగార్డ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని కోటగల్లీలో నివాసం ఉంటున్న లక్కుంట్ల రాజేశ్వర్ శుక్రవారం తన ఇంటి నుంచి తాను పని చేస్తున్న ఆఫీస్ కు బైక్ పై బయలు దేరాడు. మార్గమధ్యలో ఖలీల్ వాడిలో తన జేబులో నుంచి సెల్ ఫోన్ పడిపోయింది. అక్కేడ విధుల నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు గంగమోహన్ సెల్ ఫోన్ ను గుర్తించి రాజేశ్వర్ కు అప్పగించాడు. సెల్ ఫోన్ విలువ దాదాపు రూ.18వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. నిజాయితీ చాటుకున్న హోంగార్డు గంగా మోహన్ ను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అభినందించారు.

More articles

Latest article