29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మోసం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని,  ఈ అంశాన్ని శాసన మండలిలో లేవనెత్తాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గంగపుత్ర సంఘం ప్రతినిధులు కోరారు.  తెలంగాణ జాగృతి తరఫున బీసీ డెడికేటెడ్ కమిషన్ కి రిపోర్ట్ సమర్పించిన ఎమ్మెల్సీ కవిత కి ధన్యవాదాలు తెలిపిన నాయకులు పలు సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ , బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జై సింహా తదితరులు పాల్గొన్నారు. 

More articles

Latest article