27.3 C
Hyderabad
Friday, July 31, 2026

మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సత్యవతి కుటుంబాన్ని మాజీ మంత్రి మానవ వెంకటేశ్వరరావు గురువారం పరామర్శించారు. ఉమ్మడి డిచ్ పల్లి మండలంలోని దుస్గమ్ ఎంపీటీసీగా పనిచేసిన సత్యవతి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు గురువారం తీర్మాన్ పల్లి గ్రామంలోని సత్యవతి స్వగృహానికి వెళ్లి పరమర్శించారు. పార్టీ పరంగా సత్యవతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. సత్యవతి తల్లి మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామరాజు తో మాట్లాడుతూ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సత్యవతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, గ్రామ పెద్దలు, ఎర్రోళ్ల రామరాజు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article