24.8 C
Hyderabad
Friday, July 31, 2026

వైద్య సేవల నాణ్యత పెంచడంపై దృష్టి సారించాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

 

. . . వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

 

వేములవాడ, బతుకమ్మ :

 

ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు అందించే వైద్య సేవల్లో నాణ్యత పెంచడంపై దృష్టి సారించి, పారదర్శకమైన వైద్య సేవలు అందించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గురువారం వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఇంచార్జి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్, అత్యవసర విభాగం, డీఈఐసీ (డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్)తో పాటు ఇతర విభాగాలను సందర్శించారు. ఆసుపత్రికి రోజూ వచ్చే పేషెంట్ల సంఖ్య, అత్యవసర సేవల నిర్వహణ, ప్రసూతి విభాగంలో జరుగుతున్న డెలివరీల వివరాలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, గర్భిణీ మహిళలకు మెరుగైన ప్రసూతి సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో ఉన్న ఆడియోమెట్రిక్ మెషిన్‌ను, అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని, వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో ఆర్ఎంఓ డా.రవీందర్, సివిల్ సర్జన్ డా.పెంచలయ్య తదితరులు ఉన్నారు.

More articles

Latest article