27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్రమాదం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రయాణికులంతా సురక్షితం

 

నల్గొండ, బతుకమ్మ :

 

హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నల్గొండ సమీపంలో అగ్నిప్రమాదానికి గురైంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న వెంటనే డ్రైవర్, సిబ్బంది అప్రమత్తమై బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదం కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు.

More articles

Latest article