26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్టు 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ :-సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు జాతీయ  అధ్యక్షుడు చెన్నయ్య పిలుపు నిచ్చినటువంటి చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా గురువారం వేల్పూర్ మండల అమీనాపూర్  మాల మహానాడు నాయకులను పోలీసులు ముందస్తుగా,అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా మాల అధ్యక్షుడు సూరజ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ బద్ధంగా జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాలలు ముందుండి ఓట్లు వేసి గెలిపించారని,ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా మనువాదులకు సపోర్ట్ చేసిన నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం వత్తాసు పలకడం సరైంది కాదని అన్నారు. రాష్ట్రంలో దళితుల  జనాభా దమాష ప్రకారం రిజర్వేషన్ల శాతం పెంచేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు

More articles

Latest article