29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ : 

బాన్సువాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశాల లో పధవ తరగతి  విద్యార్ధుకుల నోట్ బుక్ లను పంపిణి చేశారు. విద్యా సంవత్సరం పునఃప్రారంభమైన సందర్భంగా బుధవారం పదవ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను స్థానిక కౌన్సిలర్ నస్రీన్ ఫెరోజ్ ఖాన్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొంతం వెంకటేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ప్రణాళికాబద్ధంగా చదువుతూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అభ్యసించాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురాగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Distribution of textbooks to 10th-grade students

More articles

Latest article