26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనాల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ: నందిపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో “గ్రామ గ్రామానికి నాణ్యమైన విత్తనం” అనే కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి రెండు వరి వంగడాలు (RD) ఒక పెసర పంట వర్షాభావం విత్తన కిట్‌ను పంపిణీ చేశారు. నాణ్యమైన విత్తనాల వాడకంతో దిగుబడులు 10 నుంచి 15 శాతం వరకు పెరుగుతాయని మండల వ్యవసాయ అధికారి జే. భవాని తెలిపారు. అదే విత్తనాన్ని సరైన ప్రక్రియలతో 2-3 సంవత్సరాలు నిల్వ చేసుకుని తిరిగి వాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఐలాపూర్ చైర్మన్ సిద్ధాపురం ముదర్శన్, సీఎఫ్ఎస్టీ రుద్రూర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం. ప్రశాంతి, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article