భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండలానికి చెందిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో భీంగల్ పట్టణం తో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 224 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్ లను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య,వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు ,తహశీల్దార్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
