24.1 C
Hyderabad
Monday, August 3, 2026

క్రీడాకారులకు స్ఫూర్తి ధ్యాన్ చంద్

Must read

📰 Generate e-Paper Clip

  •  జాతీయ క్రీడాకారులు, పి.డి. రవి

బతుకమ్మ, నవీపేట్ : ప్రముఖ హాకీ క్రీడాకారులు, మేజర్ ధ్యాన్ చంద్ నేటి క్రీడాకారులకు స్ఫూర్తి ప్రదాత అని, క్రీడాకారులు ధ్యాన్ చంద్ అడుగుజాడల్లో నడిచి క్రీడాప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని వెయిట్ లిఫ్టింగ్ జాతీయ క్రీడాకారులు ప్రభుత్వ పి.డి. రవి విద్యార్థులకు సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఆటలు ఆడాలని, ఆటల ద్వారా శారీరక, మానసిక ఆనందం కలుగుతుందని తెలిపారు. రోజు ఒక గంట ఆటలు ఆడితే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. తదనంతరం పాఠశాలలో పనిచేసే పి.ఈ. టి. ఉపాధ్యాయులు రాజు, లక్ష్మీ లను శాలువా తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండంట్ హన్మాండ్లు, ఉపాధ్యాయులు సాయి రెడ్డి, ప్రకాష్, అనంత రెడ్డి,ఆంజనేయులు, త్రివేణి, సుధారాణి, అయేషా, స్వప్న,జ్యోతి, ప్రత్యూష, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Dhyan Chand is an inspiration to sportsmen

More articles

Latest article