27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బీజేపీ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరం 50వ డివిజన్ కి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ జగదీశ్ కులకర్ణి, వారి సతీమణి మాజీ కార్పొరేటర్ అర్చన కులకర్ణి తన డివిజన్ కి చెందిన 100 మంది అనుచరులతో సోమవారం కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన పట్ల, ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలకి చలించిపోయామని, హిందువుల ఐక్యత, రాబోయే కాలంలో హిందువుల రక్షణ కోసం ఇందూరులో భారతీయ జనతా పార్టీని పెంపొందించాలన్న తన వార్డు ప్రజల కోరిక మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ వారికి కండువా కప్పి, భారతీయ జనతా పార్టీ లోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ధన్ పాల్ సూర్య నారాయణ, ధర్మపురి అర్వింద్, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

Congress leaders who joined BJP
Congress leaders who joined BJP

More articles

Latest article