24.1 C
Hyderabad
Monday, August 3, 2026

భీమశీల వాటర్ ప్లాంట్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

వాటర్ ప్లాంట్ ను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలి 

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గురువారం ఉదయం గ్రామ అభివృద్ధి కమిటీ, పిఎసీస్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామంలోని గ్రామస్తులు విమశిల వాటర్ ప్లాంట్ వద్ద మినరల్ వాటర్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టడానికి ముందుకు వచ్చిన గోపి,సందీప్ లను అభినందించారు.యువకులు ముందుకు రావడం వాటర్ ప్లాంట్ ప్రారంభించడం సంతోషకరమన్నారు.వాటర్ ప్లాంట్ లో నుండి పెళ్లిలకు,ఫంక్షలకు సప్లై చేయడం జరుగుతుందని వాటర్ ప్లాంట్ యజమానులు లోకని గోపి,కె సందీప్ లు తెలిపారు. దీనికి గ్రామస్తులు సహకరించాలని కోరారు,ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ జితేందర్,వైస్ చైర్మన్ బాల్ రెడ్డి, పిఏసిస్ డైరెక్టర్ లోకానికి గంగారం, బిజెపి మండల నాయకులు, మెండి అశోక్, లోకని గంగాధర్,యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Commencement of Bheemsheela Water Plant

More articles

Latest article