- సీఎం రేవంత్ పై ప్రజలు తిరగబడుతున్నారు
- ఏడాది పాలనలోనే ప్రజలు తిట్ల పురాణం అందుకున్నారు
- మాజీ మంత్రి, ఎమ్మల్యే ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీఆర్ఎస్ నిఖార్సయిన పార్టీ అని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ పై ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. ఏడాది పాలనలోనే ప్రజలు తిట్ల పురాణం అందుకున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి కి మూడిందని తెలిపారు. తెలంగాణ లో చిల్లర ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. దీక్షా దివస్ రోజు మీడియా డైవర్షన్ కోసమే మంత్రులు పర్యటనలు పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం నాడు కేసీఆర్ దీక్ష చేశారని తెలిపారు. కేసీఆర్ దీక్షా దివస్ తోనే నాడు కేంద్రంలో కదలిక వచ్చిందని అన్నారు. నాడు తెలంగాణ కాంగ్రెస్ చేతిలో బందీ అయిందని, నేడు రేవంత్ చేతిలో బందీ అయ్యిందని మండిపడ్డారు. 11 నెలల్లో తెలంగాణ ను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. 2027 లో జమిలీ ఎన్నికలు వస్తాయని తెలిపారు. మళ్లీ అధికారం బీఆర్ఎస్ దే అని తెలిపారు. గతంలో జరిగిన తప్పులు పొరపాట్లు సవరించుకుంటాం అని తెలిపారు. పోలీసు కేసులకు భయపడమని అన్నారు. కాంగ్రెస్ నేతల కండ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల్ గణేష్ గుప్తా, జిల్లాపరిషత్ ఛైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

