27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో కస్తూరిబా స్కూల్ విద్యార్థులకు నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసు కళాబృందం వారిచే పాఠశాలలో చక్కటి నాటిక, పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంలో స్థానిక ఎస్సై రాము మాట్లాడుతూ, యువత గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాహనం నడిపించే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదు బాధ్యతగా గుర్తించాలని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ముఖ్యంగా మహిళల భద్రత కోసంషీ టీం రక్షణ కల్పిస్తుందని తెలిపారు. స్కూల్ పిల్లలకు షీ టీం ఫోన్ నెంబర్ 8712659795, లేదా 100 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే తక్షణమే పోలీస్ సిబ్బంది మీ వద్దకు వస్తుందని అన్నారు. మీ యొక్క ఇంటి వద్ద గాని మీ స్నేహితులది గాని ఫోన్ పోయినచో స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినచో తక్షణమే CEIR పోర్టల్ ద్వారా మీ యొక్క ఫోన్ రికవరీ చేసి మీకు పోలీసు వారు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మీరు డైల్ 100 ను మాత్రం అత్యవసర సమయంలోనే ఉపయోగించగలరని తెలిపారు. గ్రామాల్లో నకిలీ ఏజెంట్ల ద్వారా నిరుద్యోగులకు మాయమాటలు, లేనిపోని ఆశలు, చెప్పి మోసం చేస్తారని మీ గ్రామాల్లో మీ ఇంటి ప్రక్కల వ్యక్తులకు అర్థమయ్యే రీతిలో తెలపాలని ఎస్సై రాము తెలిపారు. గ్రామాల్లో కానీ స్కూల్లో గాని అందరూ అన్న తమ్ముళ్ల అక్క చెల్లెళ్ల లాగా కలిసిమెలిసి ఉండాలని స్కూల్ పిల్లలకు అర్థమయ్యే రీతిలో పోలీస్ కళాబృందం వారు కథల రూపంలో పాటల రూపంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల ఎస్సై రాము, కేజీబీవీ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ లలిత, స్కూల్ ఉపాధ్యాయులు,నాన్ టీచింగ్ సిబ్బంది, పోలీస్ కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article