మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో కస్తూరిబా స్కూల్ విద్యార్థులకు నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసు కళాబృందం వారిచే పాఠశాలలో చక్కటి నాటిక, పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంలో స్థానిక ఎస్సై రాము మాట్లాడుతూ, యువత గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాహనం నడిపించే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదు బాధ్యతగా గుర్తించాలని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ముఖ్యంగా మహిళల భద్రత కోసంషీ టీం రక్షణ కల్పిస్తుందని తెలిపారు. స్కూల్ పిల్లలకు షీ టీం ఫోన్...