26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ కమిటీల పేరుతో మోసానికి యత్నం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ ఆ పార్టీకి చింన నాయకులకు, కార్యకర్తలకు ఇళ్లు పంపిణీ చేసేందుకు యత్నిస్తోందని, అర్హులకు ఇళ్లు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఒక ప్రకటనలో హెచ్చరించారు. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు పంపణీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం గరీబోళ్లను మోసం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామన్న కాంగ్రెస్.. వాటితోపాటు డబుల్ బెడ్ రూమ్ ళ్లను అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని పేర్కొన్నారు.

 

More articles

Latest article