31.6 C
Hyderabad

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రుద్రూర్ బిజెపి పార్టీ కార్యాలయం వద్ద ఎస్సి మోర్చా అధ్యక్షులు బేగరి శివప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే రుద్రూర్ గ్రామంలోని  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి స్విట్లు పంచిపెట్టి జయంతి వేడుకలను వైభవంగా జరుకున్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, నియోజవర్గ కన్వీనర్ గూడుగుంట్ల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్,  రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఉపాధ్యక్షులు బేకరీ వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, యువమోర్చా అధ్యక్షులు ఆశనోల్ల గణేష్, మండల సీనియర్ నాయకులు కటిక రాంరాజ్, నడిపి రాజేష్, పెద్దోళ్ళ శ్రీకాంత్, మండల సీనియర్ నాయకులు,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article