29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ : వేల్పూరు మండలం పడిగెల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2011- 12 బ్యాచ్ కు చెందిన విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఆదివారం వేల్పూర్ క్రాస్ రోడ్డులోని అనిల్ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు .నాటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా ఉల్లాసంగా ఆత్మీయ పలకరింపులతో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాదరావు, అశోక్, గంగాధర్,లింబాద్రి,లక్ష్మీనారాయణ, గంగ మోహన్, గంగ నరసయ్య, రాజేందర్ గౌడ్, పూర్వ విద్యార్థులు నాగరాజ్, రాకేష్, సందీప్, శ్రీకాంత్,నిఖిల, అనూష, రవళి, రమ్య, ప్రవళిక, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article