. ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చిన గొట్టుముక్కల గ్రామస్తులు
నిజామాబాద్, బతుకమ్మ: మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామ రేషన్ దుకాణం కేటాయింపు వివాదాస్పదమైంది. గ్రామస్తులకు దక్కాల్సిన దుకాణాన్ని వల్లభాపూర్ గ్రామానికి చెందిన వారికి కేటాయించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా రేషన్ దుకాణాల కేటాయింపును ఎత్తిచూపుతూ ‘బతుకమ్మ’ ఈనెల 5వ తేదీన ‘అభయహస్తం ఉన్న వారికే డీలర్ షిప్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ వ్యవహారంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. తమ గ్రామ రేషన్ దుకాణాన్ని వల్లభాపూర్ గ్రామానికి చెందిన వారికి కేటాయించారని ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చారు. అలాగ్గే వల్లభాపూర్ రేషన్ దుకాణం ఓసీకి కేటాయించగా స్థానికులతో భర్తీ చేయించుకున్నారని, తమ గ్రామ డీలర్ షిప్ ను మాత్రం స్థానికులకు కేటాయించలేదని దరఖాస్తు దారులు ఆర్డీవో రాజేందర్ ను నిలదీశారు.

