24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్ర ప్రజలందరూ అన్ని రంగాల్లో విజయాలు సాధించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఉగాది పండుగ సాక్షిగా సమాజంలోని దుష్టశక్తులకు పరాభవం కలగాలని, రాష్ట్ర ప్రజలందరూ అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. గురువారం తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్‌లో పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను అత్యంత వైభవంగా ఏర్పాటు చేశారు. టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భక్తిశ్రద్ధలతో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు టీపీసీసీ అధ్యక్షుడికి ఉప ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

All the people of the state should achieve success in all fields.

More articles

Latest article