నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన రామ్ చందర్ నాయక్ పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఎ.ఎన్ నరహరి నాయక్, ట్రెజరర్ గా ధరమ్ సింగ్ నాయక్, ఆర్గనైజర్ సెక్రటరీగా ఎల్ రవీందర్ లను ఎన్నుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదేశాల మేరకు వారి ప్రత్యేక చొరవతో ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులందరూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకొని బంజారా ఐక్యత ఏంటో మరోసారి చాటి చెప్పారన్నారు. అదేవిధంగా ఈ పదవులు తమకు శాశ్వతం కాదని ముఖ్యంగా బంజారా ఉద్యోగుల సమస్యలను అలాగే బంగారు తాండాలలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే అంతవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని అన్నారు. బంజారా ఉద్యోగులు అందరూ ఉద్యోగ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ధైర్యంగా ముందుకు వచ్చి తమ కార్యవర్గం దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.
